మనాలీలో మంచు దుప్పటి... ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
ఉత్తర భారత దేశంలో చలి తీవ్రత ఎక్కువయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
ఉత్తర భారత దేశంలో చలి తీవ్రత ఎక్కువయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీకి వచ్చిన పర్యాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతతో గజగజా వణికిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన మనాలీపై మంచు దుప్పటి కప్పేసింది. ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మంచు భారీగా పడుతుండటంతో పర్యటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహింగ్లోని సొలాంగ్, అటల్ టన్నెల్ల మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి.
ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ...
దీంతో అప్రమత్తమైన పోలీసులు సహాయక కార్యక్రమాలను చేపట్టారు. వాహనాలు మంచు కారణంగా ముందుకు వెళ్లలేకపోతున్నాయి. మనాలిలో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీ ప్రాంతానికి పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చారు. మంచు, చలిని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది పర్యాటకులు సహజంగా వస్తారు. అయితే, నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనుకూలించలేదు. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాలు ముందుకుకదల్లేక భారీగా ట్రాఫిక్ జామ్ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now