Breaking : తిరుచ్చి విమానాశ్రయంలో ఎమెర్జెన్సీ ప్రకటన
తిరుచ్చి ఎయిర్ పోర్టులో అధికారుల ఎమెర్జెన్సీనుి ప్రకటించారు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం సంభవించింది.
తిరుచ్చి ఎయిర్ పోర్టులో అధికారుల ఎమెర్జెన్సీనుి ప్రకటించారు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం సంభవించింది. తిరుచ్చి నుంచి షార్జా వెళుతున్న ఈ విమానంలో సాంకేతిక లోపాన్ని తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతికలోపాన్ని గుర్తించిన పైలట్ ఎమెర్జెన్సీని ప్రకటించారు. గంటన్నర నుంచి విమానం గాలిలోనే చక్కర్లు కొడుతోంది. సాయంత్రం ఐదున్నర గంటలకు టేకాఫ్ అయిన విమానం ఇంకా గాలిలోనే ఉంది. మరి సేఫ్ లాండింగ్ ఎలా చేయాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
సేఫ్ ల్యాండింగ్ కోసం...
హైడ్రాలిక్ సిస్టమ్ లో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరవై ఫైర్ ఇంజిన్లు, ఇరవై అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. విమానంలో మొత్తం 14o మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. ఎయిర్ ఇండియా విమానం గాలిలోనే ఉండటంతో తిరుచ్చి ఎయిర్ పోర్టులో ఉత్కంఠ నెలకొంది. అధికారులు దీనిపై అత్యవసర సమీక్ష చేస్తున్నారు. నూట నలబై మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ప్రాణాలు గాలిలోనే ఉన్నాయి. వారిని రక్షించడం కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.