స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధర దేశంలో స్పల్పంగా పెరిగింది. రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మాత్రం పెరిగాయి

Update: 2022-01-09 02:23 GMT

బంగారం ధర దేశంలో స్పల్పంగా పెరిగింది. రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మాత్రం పెరిగాయి. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో ఎవరు చెప్పలేరు. అది అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది. అందుకే పసిడి ధర తగ్గినప్పుడే కొనుగోలు చేయాలంటారు. నిపుణులు. గత కొంతకాలంగా బంగారం ధరలు పెద్దగా పెరగడం లేదు. కొన్ని రోజులు స్థిరంగా, మరికొన్ని రోజులు స్వల్పంగా ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి.

ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర తొంభై రూపాయలకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,600 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,650 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News