స్వల్పంగా పెరిగిన బంగారం ధర

దేశం లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.

Update: 2022-02-04 01:32 GMT

బంగారం అంటేనే బంగారం. దానిని భారత మహిళలను వేరు చేసి చూడలేం. ఎందుకంటే బంగారాన్ని అత్యధికంగా వినియోగించేది మహిళలే కాబట్టి. అందుకే బంగారానికి భారత్ లో అంత డిమాండ్ ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం బంగారం ధరలను నిర్ణయిస్తుంటాయి. ఇది మాఘ మాసం. పెళ్లిళ్ల సీజన్. దీంతో బంగారం కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయి. అందుకే జ్యుయలరీ షాపులన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

స్థిరంగా వెండి ధర....
దేశం లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,200 రూపాయలుగా ఉంది. ఇక వెండి కిలో ధర 65,600 రూపాయలుగా ఉంది. పెద్దగా పెరుగుదల లేదని, బంగారం కొనుగోళ్లకు ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News