గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు

దేశంలో ఈరోజు బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇది నిజంగా బంగారం కొనుగోలుదారులకు శుభవార్త అనే చెప్పాలి.

Update: 2022-03-07 01:07 GMT

బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదల ఎవరికీ తెలియదు. మనకు తెలిసిందల్లా బంగారం ధర పెరిగిందని తెలియడమే. పెరిగితే ఎక్కువగా, తగ్గితే స్వల్పంగా ధరలు ఉండటం మనకు తెలిసిన విషయమే. అందుకే బంగారం ధర పెరిగినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. తమ వద్ద డబ్బులున్నప్పుడు మాత్రమే కొనుగోలు చేస్తారు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. కొనుగోళ్లతో జ్యుయలరీ షాపులు కిక్కిరిసి పోతుంటాయి.

ధరలు ఇలా....
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధంతో బంగారం ధర ఇక రోజు పెరుగుతూనే ఉంటుందని అంచనాలో ఉన్నాం. అలాంటిది దేశంలో ఈరోజు బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇది నిజంగా బంగారం కొనుగోలుదారులకు శుభవార్త అనే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 52,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News