మహిళలకు మరోసారి షాక్...ఈరోజు కూడా బంగారం ధరలు?

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలుగా ఉంది.

Update: 2022-01-22 01:52 GMT

బంగారం అంటేనే మోజు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఒక టైం పెట్టుకోరు. ఎప్పుడంటే అప్పుడు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. బంగారం తమ వద్ద ఎంత ఎక్కువ ఉంటే అంత బంధువులు గౌరవిస్తారని నమ్ముతుంటారు. అందుకే బంగారం ధరలు పెరగడం, తగ్గడంతో వారికి పనిలేదు. వారి వద్ద డబ్బులున్నప్పుడల్లా బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. అందుకే బంగారం కొనుగోళ్లు మార్కెట్ లో ఎప్పుడూ పడిపోవు. కరోనా కష్టసమయంలోనూ వ్యాపారం జోరుగా జరిగిందంటే బంగారానికి ఉన్న వాల్యూను అర్థం చేసుకోవచ్చారు.

వెండి కూడా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగార ధర 50,500 రూపాయలు. ఇక వెండి కూడా బంగారంతో పోటీ పడి పెరుగుతోంది. కిలో వెండికి ఎనిమిది వందల రూపాయల వరకూ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెండి ధర 69,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News