గ్యాస్ ధరలు పెంపు.. కేంద్రంపై రాహుల్ ధ్వజం

పెరిగిన గ్యాస్ ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. గ్యాస్ ధరలను పెంచడంపై కేంద్ర ప్రభుత్వంపై ..

Update: 2022-05-08 11:34 GMT

న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలు, గ్యాస్ ధరలు పెంచుతూ.. సామాన్యుడిపై మోయలేని భారం మోపుతోంది. ఇటీవలే 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన చమురు సంస్థలు.. నిన్న గృహవినియోగ సిలిండర్ (14 కేజీలు) ధరపై రూ.50 పెంచింది. అన్ని నిత్యావసర వస్తువుల ధరలతో పాటు.. గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడంతో.. ఒక్క సిలిండర్ ధర రూ.1000 కి పైగా పలుకుతోంది.

పెరిగిన గ్యాస్ ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. గ్యాస్ ధరలను పెంచడంపై కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే.. గ్యాస్ ధరలు రెండింతలు అయ్యాయని అన్నారు. ఇప్పుడు ఉన్న గ్యాస్ ధరలతో 2014లో రెండు సిలిండర్లు వచ్చేవన్నారు. "2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క గ్యాస్ ధర రూ.410. సబ్సిడీగా రూ.827 ఇచ్చేవాళ్లం. కానీ, ఇప్పుడు గ్యాస్ ధర రూ.వెయ్యి అయింది. సబ్సిడీ సున్నా వస్తోంది" అని ఫైర్ అయ్యారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు.














Tags:    

Similar News