Haryana Elections 2024: హర్యానాలో సీఎం కుర్చీ దక్కాలంటే.. వీరు ఉన్న వైపేనట
హర్యానా ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో అనేక సమీకరణాలు మారుతున్నాయి.
హర్యానా ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో అనేక సమీకరణాలు మారుతున్నాయి. ఢిల్లీ ప్రభావం హర్యానాపై ప్రధానంగా పడే అవకాశముంది. అక్కడ గెలుపు కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. అనేక రకాలుగా ముఖ్యమంత్రి కుర్చీని తిరిగి కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే బీజేపీ, కాంగ్రెస్ ఎవరు గెలవాలన్నా ఒక సామాజికవర్గం మద్దతు ఉండాల్సిందే. వారు ఎవరివైపు నిలబడితే అటు వైపే విజయం వరిస్తుంది. అందుకే ఆ సామాజివర్గం ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఒకరిని మించి మరొకరు పోటా పోటీగా హామీలు ఇస్తున్నారు.
మ్యాజిక్ ఫిగర్...
ఇదిలా ఉండగా హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఉండగా అందులో 46 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. అయితే ఇందులో హర్యానా రాష్ట్రంలో 37 అసెంబ్లీ స్థానాలు కీలకంగా మారనున్నాయి. ఆ సీట్లే పార్టీల ఫేట్ ను మార్చేసిదిగా కనపడుతుంది. 37 అసెంబ్లీ స్థానాల్లో హర్యానాలో జాట్ నియోజకవర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయం పై ఆధారపడి ఉన్నవారే. వారు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీకి విజయం దక్కుతుంది. అందుకోసం జాట్ సామాజికవర్గం ఓట్ల కోసం నేతలు తీవ్రంగా కష్టపడుతున్నారు. 37 సీట్లలో జాట్ సామాజికవర్గం ప్రభావం చూపుతుండటంతో వారిని లక్ష్యంగా చేసుకుని మ్యానిఫేస్టోను కూడా రూపొందించారు.
అత్యధిక శాతం మంది...
రాష్ట్ర జనాభాలో 27 శాతం మంది జాట్ సామాజివర్గం ఓటర్లు ఉన్నారు. అయితే గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో తమ ఆందోళనలను అణిచివేసే ప్రయత్నం చేసినందున కొంత జాట్ వర్గానికి చెందిన రైతులు గుర్రుగా ఉన్నారు. అలాగే రెజర్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో కొంత అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకంపై కూడా జాట్ వర్గానికి చెందిన యువత ఆందోళనకు గతంలో దిగింది. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి గెలుపు తమదేనని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే బీజేపీ అన్ని రకాలుగా గెలుపు కోసం జాట్లను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎంత వరకూ సత్ఫలితాలనిస్తాయన్నది చూడాలి. మరోవైపు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, జన్ నాయక్ జనతా పార్టీ ప్రభావం చూపితే ఎవరికి నష్టం అన్నది మాత్రం మాత్రం తెలియాల్సి ఉంది.