ఆ రెండు రాష్ట్రాల్లో గెలుపు ఎవరిదంటే?

హర్యానాలో మరికాసేపట్లో పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి

Update: 2024-10-05 12:56 GMT

హర్యానాలో  పోలింగ్ ముగిసింది.తొంభై  అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. పీపుల్స్ ప‌ల్స్‌, సౌత్ ఫస్ట్ నిర్వహించిన ఈ సర్వేలో నేషనల్ కాన్ఫరెన్స్ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని అంచనా వేశాయి. పీపుల్స్ ప‌ల్స్‌ సర్వే ప్రకారం ఎన్సీపీ 29, బిజెపి 24, పిడిపి 16, కాంగ్రెస్ 14, ఎఐపి 5, ఇతరులు 12 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 8వ తేదీన కౌంటింగ్ జరగనుంది.

హర్యానా కాంగ్రెస్ దే...
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పీపుల్స్‌పల్స్‌ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉంటుంది. హర్యానాలో ప్రధాన పోటీ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీలు బలహీనపడ్డాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది.


Tags:    

Similar News