భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2022-03-05 01:17 GMT

బంగారం అంటేనే అందరికీ అదో రకమైన ప్రీతి. దానిని అపురూపమైన వస్తువుగా చూసుకుంటారు. ఆభరణాల రూపంలో కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఇష్టపడతారు. ఇక పెట్టుబడి రూపంలోనూ మరికొందరు చూస్తారు. అందుకే బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పుడూ పడిపోదు. బ్యాంకుల్లో పేరుకు పోయిన నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు వంటి కారణాలతో పాటు ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమాని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ధరలు ఇలా....
ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,700 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,040 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి 72.500 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News