Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2022-02-24 01:44 GMT

బంగారం అంటేనే భారతీయ మహిళలు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తూ ఉండటంతో బంగారానికి గిరాకీ ఎప్పుడూ తగ్గదు. అందుకే వీధికొక జ్యుయలరీ షాపు వచ్చినా కొనుగోలు దారులతో కిటికట లాడుతుంటాయి. బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే చూడకుండా పెట్టుబడి గా కూడా పరిగణించడంతో బంగారం, వెండికి భారతీయ మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

దిగి వచ్చిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,000 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 50,180 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర 70,000 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి కొనుగోళ్లకు ఇది మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News