కొద్దిగానే తగ్గినా... కొనుగోళ్లకు మంచి అవకాశం

ఈరోజు మాత్రం స్వల్పంగా బంగారం ధరలు తగ్గినట్లే అనుకోవాలి. పదిగ్రాములకు ఇరవై రూపాయలు మాత్రమే తగ్గింది.

Update: 2022-01-19 02:06 GMT

బంగారాన్ని ఎప్పుడూ పెట్టుబడిగానే చూడాలి. దానికి ఉన్న విలువ అలాంటిది. ఆభరణాలు కొనుగోలు చేసినా అవసరమైన సమయంలో ఆర్థికంగా ఉపయోగపడుతుంది. అందుకే బంగారం కొనుగోళ్లు ఎప్పుడూ మందగించవు. భారత్ మార్కెట్ లో పసిడికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదంటే అతిశయోక్తి కాదేమో. గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతూ, తరుగుతూ వస్తున్నాయి.

స్వల్పంగా.....
ఈరోజు మాత్రం స్వల్పంగా బంగారం ధరలు తగ్గినట్లే అనుకోవాలి. పదిగ్రాములకు ఇరవై రూపాయలు మాత్రమే తగ్గింది. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,970 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,080 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 65,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News