బంగారం స్థిరంగా.. వెండి స్వల్పంగా..?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి

Update: 2022-02-03 01:34 GMT

బంగారం, వెండి ధరలకు కళ్లెం వేయడం ఎవరి వల్లా కాదు. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల ప్రకారం ధరలు మారుతుంటాయి. భారత్ లో బంగారం, వెండికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో భారత్ లో వీటి ధరలను ఏ రోజు కారోజు బేరీజు వేసుకుని కొనుగోలు చేయాల్సిందే. బంగారం ధర తగ్గినా, పెరిగినా వాటి కొనుగోళ్లు మాత్రం ఆగవు. అలాగే వెండి కూడా. వెండి వినియోగం బంగారంతో పోలిస్తే కొంత తక్కువయినా డిమాండ్ మాత్రం అధికంగానే ఉంటుంది.

కొనుగోళ్లకు అవకాశం....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,900 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,980 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి రూ.500 లు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 65,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News