గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. బంగారం పదిగ్రాములపై రూ.300 ల వరకూ తగ్గింది.

Update: 2022-03-02 01:32 GMT

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కూడా బంగారం, వెండి ధరల పై ప్రభావం చూపుతాయి. యుద్ధంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. దానికి అనుగుణంగానే కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బంగారం ధరలు పెరిగినా, తగ్గినా మాత్రం దాని డిమాండ్ దానికి ఉంటుంది. దానిని కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది ఇష్టపడటంతో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ పడిపోదు. అలాగే వెండి కూడా.

వెండి మాత్రం.....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. బంగారం పదిగ్రాములపై రూ.300 ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,700 రూపాయలు ఉంది. అలాగే 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 50,950 రూపాయలుగా ఉంది. వెండి ధర మాత్రం హైదరాబాద్ మార్కెట్ లో కిలో 70,000లకు చేరుకుంది


Tags:    

Similar News