బంగారం ధర పెరిగింది.. ఎంతంటే?

ఈరోజు బంగారం ధర దేశ వ్యాప్తంగా పెరగింది. పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ మార్కెల్ లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

Update: 2021-12-27 01:58 GMT

దేశంలో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో తెలియరు. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధర పై ప్రభావం పడతాయి. మొన్నటి వరకూ కరోనా, ఇప్పుడు ఒమిక్రాన్ కూడా బంగారం ధరను డిసైడ్ చేస్తుంది. అందుకే బంగారం ధరలపై ఎవరూ ఖచ్చితమైన అంచనాలు చెప్పలేరు. ఐదు రోజుల క్రితం బంగారం ధర పెరిగింది. తర్వాత కొన్ని రోజులు స్థిరంగా, మరికొన్ని రోజులు స్వల్ప తగ్గుదల బంగారం ధరలో కన్పించింది.

ధరలు ఇలా.....
ఈరోజు మాత్రం బంగారం ధర దేశ వ్యాప్తంగా పెరగింది. పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ మార్కెల్ లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే స్వల్పంగానే బంగారం ధర పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. కేవలం పదిరూపాయల పెరుగుదల మాత్రమే కన్పించింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,360 రూపాయలు, 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం దర 49,490 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News