పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో ఈరోజు పది గ్రాముల బంగారం పై వెయ్యి రూపాయలు, కిలో వెండి పై రెండు వేల రూపాయలు పెరిగింది

Update: 2022-03-03 01:24 GMT

అనుకున్నట్లే అయింది. బంగారం ధర పెరుగుతుందని గత కొద్ది రోజులుగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని ముందు నుంచి అంచనాలున్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్, బ్యాంకుల్లో నిల్వలు పెరిగిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. భారతీయులు అత్యంత ఇష్టపడే బంగారం, వెండి ధరలు పెరగడంతో మార్కెట్ లో కొనగోళ్లు ఎలా ఉంటాయన్న టెన్షన్ వ్యాపారుల్లో ఉంది.

భారీగా పెరిగిన వెండి ధర....
పది గ్రాముల బంగారం పై వెయ్యి రూపాయలు, కిలో వెండి పై రెండు వేల రూపాయలు పెరిగింది. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో ధరలు పెరిగిన దాఖలాలు లేవు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,700 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 53,040 రూపాయలు ఉంది. కిలో వెండి ధర 72,100 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News