షాక్.. పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో ఈరోజు బంగారం ధర పది గ్రాముల పై 550 రూపాయలు, కిలో వెండిపై ఐదు వందల రూపాయలు పెరిగింది.

Update: 2022-02-19 01:33 GMT

మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికీ లేదు. సొంత ఇంటి కంటే ఒంటిపై బంగారానికే మగువలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారం ఉండటం ప్రతిష్టగా భావిస్తారు. అందుకే బంగారానికి భారత్ లో అంత డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ఆధారంగా కూడా బంగారం ధరలు ఉంటాయి. అందుకే బంగారం ధర పెరిగినా, తగ్గినా కొనుగోళ్లు మాత్రం భారత్ లో పెద్దగా మందగించవు. అందుకే బంగారం ఎప్పుడూ హాట్ కేకుల్లా అమ్ముడవుతూనే ఉంటాయి.

ధరలు ఇలా...
దేశంలో ఈరోజు బంగారం ధర పది గ్రాముల పై 550 రూపాయలు, కిలో వెండిపై ఐదు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 50,510 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 68,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News