Maha kumbh Mela : మహాకుంభమేళాలో తొక్కిసలాట.. పదిహేను మంది మృతి
ప్రయగ్ రాజ్ మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పదిహేను మంది మరణించారు.;
![Maha kumbh Mela : మహాకుంభమేళాలో తొక్కిసలాట.. పదిహేను మంది మృతి maha kumbh mela, fifteen people died, prayag raj](https://www.telugupost.com/h-upload/2025/01/29/1500x900_1685384-maha-kumbh-mela.webp)
ప్రయగ్ రాజ్ మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పదిహేను మంది మరణించారు. ప్రయాగరాజ్ లో గత పదిహేడు రోజుల నుంచి మహా మకుంభమేళా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు త్రివేణీ సంగమం వద్దకు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఒక్కసారిగా వచ్చి పడటంతో బారికేడ్లు విరిగిపడటంతో తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయాలపాయల్యారు. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మరణించినట్లు వెల్లడించింది.
మృతుల సంఖ్య...
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని కూడా పేర్కొంది. గాయపడిన వారిని అక్కడే ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో నేడు అమృత స్నాన ఘట్టాన్ని రద్దు చేస్తునట్లుఅఖడాలు ప్రకటించారు. దీనిపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ యోగి ఆదిత్యానాధ్ కి ఫోన్ చేసి అక్కడి పరిస్థితులను గురించి ఆరా తీశారు. మౌని అమావాస్యకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని తెలుసు. అందుకు ముందస్తు ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసింది.
అంచనాలకు మించి...
అయితే అంచనాలకు మించి భక్తులు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. మౌని అమావాస్య రోజు గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తే మోక్షం లభిస్తుందని అందరూ భావించి ఒక్కసారిగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాకు నలభై కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. అలాగే ఇప్పటికే పది నుంచి పన్నెండు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినప్పటికీ మౌని అమావాస్య రోజు మాత్రం భక్తులను నియంత్రించలేని పరిస్థితుల్లో ఈ తొక్కిసలాట జరిగింది.