రేపే రాష్ట్రపతి భవన్ లో పెళ్లి వేడుక.. ఎవరిదంటే?

రాష్ట్రపతి భవన్‌లో తొలిసారిగా పెళ్లి వేడుకను;

Update: 2025-02-11 10:29 GMT
రేపే రాష్ట్రపతి భవన్ లో పెళ్లి వేడుక.. ఎవరిదంటే?
  • whatsapp icon

రాష్ట్రపతి భవన్‌లో తొలిసారిగా పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న జరిగే ఈ వేడుక కోసం రాష్ట్రపతి భవన్‌ను ముస్తాబు చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి పూనమ్‌ గుప్తా పెళ్లి ఇక్కడ జరగనుంది. పూనమ్‌ వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతినిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన సీఆర్‌పీఎప్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ అవ్‌నీశ్‌ కుమార్, పూనమ్‌ గుప్తాను పెళ్లి చేసుకోనున్నారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన పూనమ్‌గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ విభాగంలో 81వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత రాష్ట్రపతి పీఎస్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఉన్న అవ్‌నీశ్‌ కుమార్‌తో ఈమె వివాహం నిశ్చయమైంది. రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి చేసుకోవాలనేది తన చిరకాల కోరిక అని.. నా కోరికను మీరు తీరుస్తారని రాష్ట్రపతికి లేఖ రాశారు పూనమ్. రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందించడంతో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరగనుంది. ఈ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, అంకితభావంతోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మనసు గెలుచుకుంది పూనమ్‌. దీంతో పూనమ్‌ కోరిక మేరకు రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకునేందుకు రాష్ట్రపతి అనుమతిచ్చారు. పెళ్లికి ముందే పూనమ్ కు జీవితాంతం మర్చిపోలేని కానుకను అందించారు ముర్ము. ఫిబ్రవరి 12న మదర్‌ థెరిసా క్రౌన్‌ కాంప్లెక్స్‌లో తన కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహం జరగనుంది.


Tags:    

Similar News