ఓటర్ ఐడి జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలా?
లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 వరకు జరగనున్న ఎన్నికలపై ఓటర్లు ఉత్కంఠగా
లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 వరకు జరగనున్న ఎన్నికలపై ఓటర్లు ఉత్కంఠగా ఉన్నారు. ఎన్నికలలో ఓటు వేయడానికి, ఓటరు ఐడితో పాటు ఎన్నికల సంఘం ఎలక్టోరల్ లిస్ట్‌లో పేరు తప్పనిసరిగా ఉండాలి. ఈ జాబితా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఓటు వేయడానికి ఓటర్ ఐడి మాత్రమే సరిపోదు.
మీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి, మీ పేరును ఎన్నికల జాబితాలో చేర్చడం ముఖ్యం. ఎన్నికల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఆన్‌లైన్‌లో సులభంగా చూసుకోవచ్చు. దీన్ని చేయడానికి ఈ దశలను అనుసరించండి.
ఓటరు జాబితాలో పేరును ఎలా తనిఖీ చేయాలి
ఆన్ లైన్ ద్వారా.
➦ ఇందుకోసం.. ముందుగా https://nvsp.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
➦ ఇక్కడ ఎలక్టోరల్ రోల్‌పై క్లిక్ చేయండి.
➦ వెంటనే కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఓటర్ ఐడి వివరాలను ఎంటర్ చయాలి.
➦ ఇందులో పేరు, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, రాష్ట్రం , జిల్లా అక్కడ అడిగిన వివరరాలను నమోదు చేయాలి.
➦ దీని తర్వాత కింద ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, సర్చ్ పై క్లిక్ చేయండి.
➦ అదే పేజీలో EPIC నంబర్, స్టేట్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాల్సిన మరొక లింక్‌ని పొందుతారు.
➦ ఆ తర్వాత కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
SMS ద్వారా చెక్ చేసుకోండిలా..
➦ మీరు మీ ఫోన్ నుండి టెక్స్ట్ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది.
➦ EPIC అని టైప్ చేసిన తర్వాత ఓటర్ ID కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి.
➦ అప్పుడు ఈ మెసేజ్‌ను 9211728082 లేదా 1950కి పంపండి.
➦ దీని తర్వాత మీ నంబర్‌కు ఓ మెసేజ్ వస్తుంది. అందులో మీ పోలింగ్ నంబర్, పేరు ఉంటుంది.
➦ ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే మీకు ఎలాంటి సమాచారం అందదని గుర్తించుకోండి.
హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా..
ఇక హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం టోల్-ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐవీఆర్ ప్రకారం.. మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. అనంతరం ప్రాంప్ట్ కాల్‌ను అనుసరించి 'ఓటర్ ఐడీ స్టేటస్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఐవీఆర్ చెప్పినట్టు.. EPIC ఓటర్ ఐడీ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ నంబర్ నమోదు చేసిన తర్వాత మీ ఓటర్ ఐడీ స్టేటస్ ఏంటనేది తెలుసుకోవచ్చు.