రావెల మిస్ అయి....ఏం చేశారో తెలుసా?

Update: 2017-02-03 18:00 GMT

ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు దాదాపు మూడు గంటలు పోలీసు అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ సంఘటన జరిగి చాలా రోజులైనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక కేబినెట్ మంత్రి తన గన్ మెన్ లను వదిలి ఎక్కడకు వెళ్లారన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. గత నెలలో రావెల కిషోర్ బాబు తన ఇంటి నుంచి గన్ మెన్ లకు చెప్పకుండా కారును తానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇది గన్ మెన్ లు గమనించలేదు. ఎంతసేపటికీ మంత్రిగారు రాకపోవడం...ఆయనకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో గన్ మెన్ లు ఆందోళనకు గురై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు రావెల మిస్ అయ్యారు. దీంతో ఇంటలిజెన్స్ రంగంలోకి దిగింది. అయితే మూడు గంటల తర్వాత వచ్చిన మంత్రి తన స్నేహితుడి ఇంటికి డిన్నర్ కు వెళ్లానని తాపీగా చెప్పటంతో పోలీసులు విస్తుబోయారు. ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా చెప్పారు.

భవిష్యత్ కార్యాచరణ కోసమే..

దీంతొ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా తెలయడంతో ఆయన సీరియస్ అయ్యారు. అదే రోజు ఉదయం మంత్రి రావెలను చంద్రబాబు మందలించారట. గుంటూరులో గ్రూపులు ఎందుకు మెయిన్ టెయిన్ చేస్తున్నావని నిలదీశారట. అంతేకాకుండా పార్టీలో సభ్యుడివి కాకపోయినా...ఎన్నికలకు ముందు వచ్చి పార్టీలో చేరితే...టిక్కెట్ ఇచ్చి...మంత్రిపదవి కూడా ఇస్తే ఇలా వర్గాలను ప్రోత్సహించడమేమిటని మండిపడ్డారట. ఇలా చేస్తే మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారట బాబు. దీంతో మనస్థాపానికి గురైన రావెల తన సన్నిహితులను సంప్రదించడానికి వెళ్లారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించుకుండా ఏం చేయాలి? ఒకవేళ తప్పిస్తే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అన్న అంశాలపై క్లోజడ్ డోర్ మీటింగ్ ఫ్రెండ్స్ తోనూ, తన సామాజిక వర్గానికి చెందిన నేతలతోనూ పెట్టుకున్నారని చెబుతున్నారు. ఈ విషయం కూడా చంద్రబాబుకు తెలియడంతో రావెలపై ఆగ్రహంగా ఉన్నారట. తనకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టే స్థాయికి రావెల వచ్చాడట కదా? అని సీనియర్ల వద్ద బాబు ప్రస్తావించారట. వచ్చే మంత్రి వర్గ విస్తరణ లో రావెల పదవి ఊడటం ఖాయమంటున్నారు టీడీపీ సీనియర్లు.

Similar News