మెట్రోలో ముద్దులతో రచ్చచేసిన జంట
వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లని అలా వదిలేయండి అని ఒకరంటే.. ఆ వీడియో తీసిన వ్యక్తిని..
ఢిల్లీ మెట్రోలో మరో యువజంట ముద్దులతో రచ్చచేసింది. నలుగురిలో, పబ్లిక్ ప్లేస్ లో ఉన్నామన్న విచక్షణ మరిచిపోయి.. ముద్దుల్లో మునిగితేలారు. ఓ వ్యక్తి ఈ దృశ్యాలను వీడియోగా తీసి.. నెట్టింట్లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయి.. వివాదానికి దారితీసింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లని అలా వదిలేయండి అని ఒకరంటే.. ఆ వీడియో తీసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని మరొకరు.. వాళ్లేమైనా చేయకూడని నేరం చేశారా ? అని ఇంకొకరు ఇలా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్.. హుడా సిటీలో తనిఖీ చేశామని, వీడియోలో కనిపించిన వారెవరూ అక్కడ లేరని పేర్కొంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ అవుతోంది.
యూపీలోని ఘజియాబాద్ లో మరో ప్రేమజంట రెచ్చిపోయింది. నడిరోడ్డుపై బైక్ నడుస్తుండగానే.. ఓ యువతి పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని.. బాయ్ ఫ్రెండ్ కు ముద్దులిస్తూ రచ్చ చేసింది. ఘజియాబాద్ నేషనల్ హైవే 9 పై ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాన్ని చిత్రీకరించిన వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇలాంటి వారివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నెటిజన్లు సైతం రోడ్డుపై ఇలాంటి స్టంట్లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బైక్ నంబర్ ఆధారంగా వారిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.