చేపతో సెల్ఫీ తీసుకుని.. నెటిజన్లకు నవ్వుతెప్పిస్తోన్న వీడియో !
ఈ క్రమంలో అతనికి ఓ చేప చిక్కింది. ఆ చేపను పైకి చూపిస్తూ.. తన సెల్ఫోన్లో సెల్ఫీలు తీసుకున్నాడు. కొద్దిసేపు ఫొటోలు..
స్మార్ట్ ఫోన్ల మోజులో పడి.. చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇటీవల ఓ యువకుడు వెనుక ట్రైన్ వస్తుండగా వీడియో తీయబోయి.. గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డాడు. సోషల్ మీడియాలో ఈ తరహా ఘటనలను తరచూ చూస్తుంటాం. తాజాగా ఓ వ్యక్తి తన ఫోన్ ను సముద్రంలోకి విసిరేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్ల ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ ఫన్నీ వీడియోలో ఓ వ్యక్తి మోటార్ బోట్ లో సముద్రంలో సరదాగా చేపలు పెట్టేందుకు వెళ్లాడు.
ఈ క్రమంలో అతనికి ఓ చేప చిక్కింది. ఆ చేపను పైకి చూపిస్తూ.. తన సెల్ఫోన్లో సెల్ఫీలు తీసుకున్నాడు. కొద్దిసేపు ఫొటోలు దిగాక.. చేపను సముద్రంలో వదలబోయి.. తన ఖరీదైన ఫోన్ ను సముద్రంలోకి విసిరేశాడు. అతను తేరుకుని ఫోన్ ని అందుకునేలోపే.. అది నీటిలో మునిగిపోయింది. తన సెల్ సముద్రంలో పడిపోవటంతో అతని ముఖంలో కనిపించిన హావభావాలు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఇదంతా మరో బోట్ లో ఉన్న వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకూ 12.5 మిలియన్ల మంది దీనిని చూశారు. కొందరు నెటిజన్లు అది నిజమైన ఫోన్ అయి ఉండదని, ఫ్రాంక్ వీడియో కావొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.