యువతి చెవిలోకి దూరిన పాము.. నెట్టింట వీడియో వైరల్

ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న యువతి చెవిలో పాము కనిపిస్తుంది. దాని తల పైకి ఉండగా..;

Update: 2022-09-07 12:26 GMT

సాధారణంగా పామును చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి పాము ఏకంగా ఓ యువతి చెవిలో దూరింది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న యువతి చెవిలో పాము కనిపిస్తుంది. దాని తల పైకి ఉండగా.. శరీర భాగమంతా చెవి రంధ్రం లోపలికి ఇరుక్కు పోయింది. ఓ వైద్యుడు పటకార్ తో పామును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ పాము తలభాగం కూడా చెవి రంధ్రం లోపలికి వెళ్లిపోతుందేమోనని భయపడుతుంటాడు. ఆఖరికి రెండు పటకార్లను ఉపయోగించి పామును తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ వీడియో ఓ యువతి ఇన్ స్టా లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది. చెవిలో నుంచి పామును బయటికి తీశారో లేదో తెలీదు కానీ.. వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భయపడుతున్నారు.


Tags:    

Similar News