చివరి వన్డేలో భారత్ లక్ష్యమిదే
భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ వన్డేలో ఆసిస్ బాటర్లు పరవాలేదనింపించారు. భారత్ బౌలర్లు కూడా రాణించారు.
భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ వన్డేలో ఆసిస్ బాటర్లు పరవాలేదనింపించారు. భారత్ ముందు 270 పరుగులు ఛేదించాల్సి ఉంది. ఆసిస్ బ్యాటర్లు అందరూ నిలకడగానే ఆడినట్లు అనుకోవాల్సి ఉంటుంది. భారీ పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచారు. భారత్ బ్యాటర్లు వరసగా విఫలమవుతున్న వేళ ఇది అతి పెద్ద లక్ష్యంగానే చెప్పుకోవాలి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో యాభై ఓవర్లకు ఆసిస్ 269 పరుగులు చేసింది. పది వికెట్లు కోల్పోయింది.
బౌలర్లు రాణించినా...
భారత్ బౌలర్లు రాణించారు. ప్రధానంగా హార్ధిక్ పాండ్యా నిలదొక్కుకున్న ఆసిస్ బ్యాటర్లను త్వరగా పెవిలియన్ కు పంపించడంతో ఈ తక్కువ స్కోరు అయినా లభించింది. హార్థిక్ పాండ్యా మూడు, కులదీప్ మూడు, అక్షర్ పటేల్ రెండు, సిరాజ్ ఒక వికెట్ ను తీసుకున్నారు. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ కూడా తన బ్యాట్ ను ఝుళిపించాల్సి ఉంటుంది. వరసగా డకౌట్లు అవుతూ వస్తున్న సూర్య ఈరోజు అయినా మెరుపులు కురిపిస్తాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.