ధోని, విరాట్ కోహ్లీ కలిసి నా కొడుకు జీవితంలో 10 సంవత్సరాలను నాశనం చేశారు
సంజు శాంసన్ వివాదాలకు దూరంగా ఉంటాడు
భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో తన కుమారుడికి స్థిరమైన అవకాశాలు ఇవ్వకుండా అతడి 10 విలువైన సంవత్సరాలను వృధా చేశారని ఆరోపించాడు. శాంసన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో మొదటి మ్యాచ్ లో సెంచరీ చేయగా.. వరుసగా రెండు మ్యాచ్ లలోనూ డకౌట్ గా వెనుదిరిగాడు.
కేరళకు చెందిన వార్తా సంస్థ మీడియా వన్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథ్ శాంసన్ తన కుమారుడు సంజూ దశాబ్దకాలంగా అవకాశాలు కోల్పోయాడన్నారు. భారత జట్టు మాజీ కెప్టెన్లు MS ధోనీ, విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల నిర్ణయాలు సంజూ అంతర్జాతీయ కెరీర్‌ను నాశనం చేశాయని ఆరోపించారు. సంజూ పదేళ్ల కెరీర్‌ను వృధా చేసిన 3-4 మంది ఉన్నారని రెలిపాడు. అతన్ని ఎంతగా బాధపెట్టారో, సంజు సంక్షోభం నుండి అంత బలంగా బయటపడ్డాడని అన్నారు.
సంజు శాంసన్ వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే, అతని తండ్రి బహిరంగ వ్యాఖ్యలు త్వరగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆన్ లైన్ తీవ్ర చర్చకు దారితీసింది. సంజూ శాంసన్ కు అవకాశాలు ఇచ్చినా నిలకడగా రాణించలేకపోయాడని పలువురు క్రికెట్ అభిమానులు చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికా సిరీస్ లో మొదటి మ్యాచ్ లో సెంచరీ కొట్టిన సంజూ.. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలోనూ డకౌట్ అయ్యాడని గుర్తు చేశారు.