INDvsSA: టెన్షన్ పెట్టినా.. గెలిచేశాం!!

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20లో 220 పరుగుల లక్ష్యాన్ని 11 పరుగుల తేడాతో చేరుకుని గెలిచింది. తిలక్ వర్మ సెంచరీ.

Update: 2024-11-14 02:25 GMT

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయాన్ని అందుకుంది. టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య సఫారీ జట్టు ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులకే పరిమితమైంది. దీంతో 11 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ 41 పరుగులు, మార్కో యన్‌సెన్ 54 రన్స్ తో రాణించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్ 29, ర్యాన్ రికెల్టన్ 20, రీజా హెండ్రిక్స్ 21, ట్రిస్టన్ స్టబ్స్ 12, డేవిడ్ మిల్లర్ 18, గెరాల్డ్ కోయెట్జీ 2(నాటౌట్), సిమలానీ 5 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు కీలకమైన వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసి భారత్ కు విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 1, సంజు శాంసన్ 0, అభిషేక్ శర్మ 50, తిలక్ వర్మ 107 (నాటౌట్), హార్దిక్ పాండ్యా 18, రింకూ సింగ్ 8, రమణ్‌దీప్ సింగ్ 15, అక్షర్ పటేల్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహారాజ్, సిమలానీ చెరో 2 వికెట్లు, యన్‌సెన్ 1 వికెట్ తీశారు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో మ్యాచ్ శుక్రవారం నాడు జరగనుంది.



Tags:    

Similar News