IPL 2024 : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. ఇక అన్ని మ్యాచ్‌లు ఇక్కడేనట
ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లు ఇండియాలోనే జరుగుతాయని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు
ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లు ఇండియాలోనే జరుగుతాయని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. మ్యాచ్‌లు ఎక్కడికీ తరలించే ఆలోచన లేదని కూడా ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ సీజన్ లో మ్యాచ్ లలో కొన్ని యూఏఈలో నిర్వహించే అవకాశముందన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికలకు, ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధం లేదని ఆయన తెలిపారు. అన్ని మ్యాచ్‌లు ఇండియాలోనే జరుగుతాయని ఆయన తెలిపారు. ఐపీఎల్ 17వ సీజన్ అంతటా ఇండియాలోనే జరుగుతుందని ఆయన చెప్పారు.
ఈ నెల 22 నుంచి...
ఐపీఎల్ 2024 సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఇప్పటి వరకూ 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలయింది. మిగిలిన షెడ్యూల్ ను కూడా త్వరలో విడుదల చేస్తామని జైషా తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి ఇప్పటికే 21 స్టేడియాలలో టిక్కెట్లు అభిమానులు బుక్ చేసుకున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ ఈసారి కూడా అహ్మదాబాద్‌లో జరిగేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది.