IPL 2024 : వారెవ్వా.. సమ్మర్ కు ముందే కళ్లను.. కాళ్లను కట్టిపడేసే రోజు... తొందరలోనే

ఐపీఎల్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. కొన్ని నెలల పాటు జరిగే ఈ మ్యాచ్ లు ప్రతి రోజూ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తాయి.

Update: 2024-02-22 07:48 GMT

ఐపీఎల్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. కొన్ని నెలల పాటు జరిగే ఈ మ్యాచ్ లు ప్రతి రోజూ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తాయి. ఒకరకంగా క్రిక్రెట్ ప్రేమికులకు పండగ సీజన్ అంటే అది ఐపీఎల్ టైంలోనే. ఎందుకంటే అందరి ఆటగాళ్లను చూడొచ్చు. అలాగే అన్ని మ్యాచ్‌లను తీరిగ్గా తిలకించేందుకు వీలుంది. కాలక్షేపం కోసమే కాదు.. తమ అభిమాన జట్టు గెలవాలని కోరుకునే అభిమాని టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటాడు. అందుకే ఐపీఎల్ అంటే ఒక మజా. దానిని ఆస్వాదించేందుకు అందరూ సిద్ధంగా ఉంటారు.

ఆ మజాయే వేరు...
ముగింపు మ్యాచ్ వచ్చిందంటే ఏదో దిగులు. అప్పుడే అయిపోయిందా? అన్న బాధ. అలా ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్ జీవితంలో ఒక భాగమయి పోయింది.ఐపీఎల్ మ్యాచ్ లపై ఆసక్తి ఈ నాటిది కాదు. ఫస్ట్ సీజన్ నుంచి ప్రారంభమైన ఆసక్తి నానాటికీ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఎన్ని జట్లు? ఎందరు ఆటగాళ్లు? ఇండియా మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లు జట్టులో ఆడుతుంటే ఆ కసి వేరుగా ఉంటుంది. అందరూ మనోళ్లే. కానీ గెలిచే టీం ఒక్కటే. అందులోనూ ధోనీ మళ్లీ మైదానంలో కనిపిస్తాడన్న ఆశ చాలా మందిలో ఉంటుంది.
ధోనీని చూసే అవకాశం...
ధోనీ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేసి చాలా కాలమయింది. కానీ మహేంద్రుడిలో పస తగ్గలేదు. చేవ చచ్చిపోలేదు. వికెట్ల వెనక అంతే వేగంగా కదలికలు. అలవోకగా సిక్సర్లు.. అందుకే ధోనీని పసుపు జెర్సీలో చూడాలని అభిమానులు తెగ సంబరపడిపోతుంటారు. ధోనీ ప్రాతనిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని ఎక్కువ మంది కోరుకుంటారు. ధోనిని చూడాలనుకుంటే అది ఐపీఎల్‌లోనే సాధ్యమవుతుంది. అందుకే ఈ సీజన్ కోసం ప్రతి అభిమాని ఆట కోసం కంటే ధోని కోసం అంతకంటే ఎక్కువగా ఎదురు చూస్తుంటారు.
మన మైదానాల్లోనే...
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు వచ్చే నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదీ మనదేశంలోనే. మొన్నటి వరకూ ఒక సందేహం ఉండేది. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మ్యాచ్‌లు జరుగుతాయా? లేక విదేశాల్లో జరుగుతాయా? అనన అనుమానాలకు తెరపడింది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధమాల్ పూర్తిగా మ్యాచ్ లన్నీ భారత్ లోనే జరుగుతాయని చెప్పారు. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుందని కూడా తెలిపారు. మార్చి 22వ తేదీన చెన్నైలో ఈ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.


Tags:    

Similar News