India Vs South Africa : ఉత్కంఠల మధ్య సాగిన మ్యాచ్.. తక్కువ స్కోరుకు రెండో టీ 20
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టీ 20 మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు మ్యాచ్ దక్షిణాఫ్రికా పరమయింది.
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టీ 20 మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు మ్యాచ్ దక్షిణాఫ్రికా పరమయింది. భారత్ ఓటమి పాలయింది. తక్కువ స్కోరుకే రెండు జట్లు చేయడంతో చివరి బాల్ వరకూ టెన్షన్‌తో సాగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటర్లు బ్యాటింగ్ చేపట్టారు.అయితే తడబడ్డారు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన సంజూ శాంసన్ ఈసారి డకౌట్ అయ్యాడు. వరసగా పెవిలియన్ బాట పట్టారు. ఎవరూ పెద్దగా ఆడలేదు. అభిషేక్ శర్మ కూడా వెనువెంటనే అవుట్ కావడంతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు.
బ్యాటర్లు తడబడి...
తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా క్రీజులో పెద్దగా నిలవలేదు. తిలక్ వర్మ నిలదొక్కుకున్నాడు అనుకున్నప్పటికీ తర్వాత క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో ఇరవై పరుగులకే అవుట్ అయ్యారు. ఒక్క అక్షరపటేల్ మాత్రం కొద్దిగా పరవాలేదని పించాడు. సిక్సర్లు, ఫోర్లతో కొంత దక్షిణాఫ్రికా బౌలర్లను బెదిరించాడు. అయితే 27 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బ్యాడ్ లక్ గా రన్ అవుట్ అయ్యాడు. భారత్ బ్యాటర్లలో ఒక్క హార్ధిక్ పాండ్యా మాత్రమే 39 పరుగులు చేసి పరవాలేదని పించాడు. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచాల్సిన భారత్ బ్యాటర్లు కేవలం 124 మాత్రమే చేయగలిగారు. ఇది దక్షిణాఫ్రికా ముందు స్వల్ప లక్ష్యమేనని ముందుగానే తెలిసిపోయింది.
స్వల్ప లక్ష్య సాధనే అయినా...
అయితే తర్వాత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కూడా పెద్దగా స్కోరు చేయలేకపోయింది. లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమించాల్సి వచ్చింది. హెండ్రిక్స్ 24 పరుగులు చేశాడు. రికిల్‌టన్ పదమూడు పరుగులకే అవుటయ్యాడు. క్లాసెన్ రెండు, మిల్లర్ డకౌట్ తో వెనుదిరిగారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో స్టబ్స్ మాత్రమే చివర వరకూ క్రీజులో నిలబడి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు. వరుణ్ చక్రవర్తి మాయ చేసి ఐదు వికెట్లు తీసినా ఫలితం లేదు. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీయగలిగారు. ఒకదశలో భారత్ వైపు విజయం తొంగి చూసినా స్టబ్స్ దానిని లాగేసుకున్నాడు. స్బబ్స్ నిలబడి దక్షిణాఫ్రికాను 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించాడు. దీంతో రెండు టీ 20 దక్షిణాఫ్రికా పరమయింది. మూడో టీ 20 మ్యాచ్ ఈ నెల 13వ తేదీన జరగనుంది.