South Africa vs India మూడో టీ20లోనూ మొదటి బ్యాటింగ్ మనదే.. ఎవరికి ఛాన్స్ ఇచ్చారంటే?

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయడంతో

Update: 2024-11-13 14:40 GMT

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయడంతో, బుధవారం సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగే మూడో T20I మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా రెండూ విజయాన్ని నమోదు చేయాలనే ఉత్సాహంతో ఉన్నాయి. తొలి రెండు గేమ్‌లలో బెంచ్‌పై నిలిచిన రమణదీప్ సింగ్‌ ఈ మ్యాచ్ లో డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. రమణదీప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన రమణదీప్ సింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 166.67 స్ట్రైక్ రేట్‌తో 19 మ్యాచ్‌లలో 170 పరుగులు చేశాడు. గత IPL సీజన్‌లో అతను 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. రమణదీప్ 57 టీ20మ్యాచ్ లు ఆడి 170.00 స్ట్రైక్ రేట్‌తో 544 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలింగ్ కూడా చేయగలడు.. అతడు 16 టీ20 వికెట్లు సాధించాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఆవేశ్ ఖాన్ స్థానంలో రమణ్ దీప్ సింగ్ ను తీసుకుంది. ఈ సిరీస్ లో భారత్ మొదటి గేమ్‌లో 61 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది, రెండవ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(సి), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలనే, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా




Tags:    

Similar News