ఈ ఫోటోలో గాయంతో ఉన్న క్రికెటర్ ఎవరో తెలుసా..?
ఒక అథ్లెట్‌కి ఎప్పుడూ ప్రయాణం సాఫీగా సాగదని తెలిపాడు. కొన్ని రోజులు మీరు విజయంతో ఇంటికి వస్తారు, మరికొన్ని రోజులు
భారత క్రికెట్ జట్టు అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయం అయింది. చంద్ తన ఎడమ కన్ను ఉబ్బిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అతడికి ఏమైందా అని అందరూ భయపడ్డారు. అయితే అతను ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడని తెలుస్తోంది.
"It's never a smooth ride for an athlete. Some days you come home victorious, other days disappointed and there are some when you come home with bruises and dents. Grateful to God to have survived a possible disaster. Play hard but be safe. It's a thin line. Thank you for the good wishes," అంటూ ఉన్ముక్త్ చంద్ ఫోటోను పోస్టు చేశాడు.
ఒక అథ్లెట్‌కి ఎప్పుడూ ప్రయాణం సాఫీగా సాగదని తెలిపాడు. కొన్ని రోజులు మీరు విజయంతో ఇంటికి వస్తారు, మరికొన్ని రోజులు నిరాశ చెందుతారు. మీరు గాయాలతో ఇంటికి తిరిగి వచ్చిన క్షణాలు కూడా కొన్ని ఉంటాయని తెలిపాడు. అయితే ఈ విపత్తు నుండి బయటపడినందుకు దేవునికి కృతజ్ఞతలని తెలిపాడు. కష్టపడి ఆడండి, కానీ సురక్షితంగా ఉండండని సూచించాడు. కోలుకోవాలని ప్రార్థిస్తున్నా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నానని ట్విట్టర్ లో వెల్లడించాడు. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన U-19 ప్రపంచకప్‌ల ఫైనల్‌లో మెరుపు సెంచరీని కొట్టిన చంద్, ఢిల్లీ, ముంబై తరపున IPL ఆడినప్పటికీ సీనియర్ స్థాయిలో పెద్దగా విజయం సాధించలేకపోయాడు. అతను ఆగష్టు 2021లో భారత క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. క్రికెట్ ను కొనసాగించడానికి USAకి వెళ్లాడు. సెలెక్టర్లు తనను పక్కన పెట్టారని, USA క్రికెట్ నుండి తనకు ఆఫర్ వచ్చినప్పుడు, క్రికెట్ కెరీర్ ను మళ్లీ ప్రారంభించడానికి సరైన అవకాశాన్ని చూశానని చంద్ చెప్పాడు. గత సంవత్సరం, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున బిగ్ బాష్ లీగ్ (BBL)లో పాల్గొన్న మొదటి భారతీయ ఆటగాడిగా చంద్ నిలిచాడు. ఇప్పుడు అమెరికాలో వివిధ లీగ్‌లను ఆడుతున్నాడు. చంద్ SA20 లీగ్ వేలంలో భాగమయ్యాడు, కానీ అతన్ని కొనుక్కోడానికి ఎవరూ ముందుకు రాలేదు.