కుప్పకూలిన టాప్ ఆర్డర్... కష్టాల్లో టీం ఇండియా
భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇండియన్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా ఆడలేకపోయారు.
భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇండియన్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా ఆడలేకపోయారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్ గా దిగిన శిఖర్ థావన్ ఏడు పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం భారత్ వెనువెంటనే రెండు కీలక వికెెట్లను కోల్పోయింది. రోహిత్ 27 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొహ్లి తొమ్మిది పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయినట్లయింది.
షాకిబ్ కు ఐదు వికెట్లు....
కేఎల్ రాహుల్ ఒక్కడే కుదురుకుని ఆడుతున్నాడు. యాభై పరుగులు చేసిన కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఇరవై నాలుగు పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక వరసగా వికెట్లు పడుతుండటంతో టీం ఇండియా కష్టాల్లో పడిదంి. 36 ఓవర్లకు గాను 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్ షాకిబ్ ఐదు వికెట్లను తీసి భారత్ మిడిలార్డర్ ను కుప్పకూల్చాడు. దీంతో ఎక్కువ పరుగులు చేయకుండానే భారత్ ఈ మ్యాచ్ ను ముగించే పరిస్థితికి చేరకుంది.