Nitish Kumar Reddy: దుమ్ము దులిపిన నితీష్ కుమార్ రెడ్డి.. భారీ స్కోర్ చేసిన భారత్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో

Update: 2024-10-09 15:24 GMT

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో తొలి T20I హాఫ్ సెంచరీని నమోదు చేశాడు భారత యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నితీష్ కుమార్ రెడ్డి మొదట స్లోగా ఆడినా ఆ తర్వాత చెలరేగి ఆడాడు. మూడో ఓవర్‌లో అభిషేక్ శర్మ వికెట్ పడిపోవడంతో నితీష్ రెడ్డి నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. 21 ఏళ్ల యువకుడు 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (20సంవత్సరాల143రోజులు), తిలక్ వర్మ (20 సంవత్సరాల, 271 రోజులు), రిషబ్ పంత్ (21సంవత్సరాల, 38రోజులు) తర్వాత అతి చిన్న వయసులో టీ20 ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు.

నితీష్ కుమార్ రెడ్డితో పాటూ రింకూ సింగ్ కూడా ఈ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ కలిసి 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రింకూ సింగ్ 53 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. చివర్లో 6 బంతుల్లో పరాగ్ 15 పరుగులు చేశాడు. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.


Tags:    

Similar News