పీకల్లోతు కష్టాల్లో టీం ఇండియా
భారత్ - ఆస్ట్రిలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇండియా కష్టాల్లో పడింది. 179 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.
భారత్ - ఆస్ట్రిలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇండియా కష్టాల్లో పడింది. 179 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ మొత్తం విఫలమయింది. ఎవరూ పెద్దగా స్కోరు చేయలేదు. చివరకు ఆల్ రౌండర్లే నిలకడగా ఆడుతుండటం విశేషం. ఇంకా ఆస్ట్రేలియా కన్నా 84 పరుగులు భారత్ వెనకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు భారత్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు.
తడబడిన బ్యాటర్లు...
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆల్ అవుట్ అియంది. అయితే తర్వాత బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. ఎప్పటిలాగానే కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. రోహిత్ శర్మ కూడా తక్కువ పరుగులకే అవుటయ్యాడు. అన్నీ కీలకమైన వికెట్లు కోల్పోయి టీం ఇండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం అక్షర పటేల్, అశిన్ లు ఆడుతున్నారు. ఇంకా 84 పరుగులు చేస్తేనే ఆస్ట్రేలియా చేసిన పరుగులతో సమం అవుతుంది.