భారీ టార్గెట్... శ్రీలంక ఛేదించేనా?
గౌహతిలో జరిగిన తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. ఏడు వికెట్లు కోల్పోయి భారత్ 373 పరుగులు చేసింది
గౌహతిలో జరిగిన తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. ఏడు వికెట్లు కోల్పోయి భారత్ 373 పరుగులు చేసింది. శ్రీలంక లక్ష్యం యాభై ఓవర్లలో 374 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయతే ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ క్రీజుకు అతుక్కు పోయి ఆడటంతో భారత్ కు భారీ స్కోరు లభించిందని చెప్పాలి. రోహిత్ శర్మ 83 పరుగులు, శుభమన్ గిల్ 70 పరుగులు చేసి అవుటయ్యారు.
కొహ్లి సూపర్ సెంచరీ...
అనంతరం బరిలోకి దిగిన భారత బ్యాటర్లు వరసగా పెవిలియన్ చేరుతున్నా విరాట్ కొహ్లి మాత్రం తన షాట్లతో అదరగొట్టారు. విరాట్ కొహ్లి 113 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో విరాట్ వన్డేలో 45వ సెంచరీ చేసినట్లయింది. శ్రీలంక బౌలర్లు పూర్తిగా విఫలం కావడం వల్లనే భారత్ భారీ స్కోరు లభించింది. మరి శ్రీలంక ఈ స్కోరును అధిగమిస్తుందా? భారత్ బౌలర్ల సక్సెస్ అవుతారా? లేదా? అన్నది మరికాసేపట్లో తేలనుంది.