ఛాంపియన్ గా నిలిచిన భారత్.. సూపర్ విక్టరీ

భారత ఫుట్ బాల్ జట్టు మరో టైటిల్ ను సొంతం చేసుకుంది. 9వ సారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Update: 2023-07-05 01:49 GMT

భారత ఫుట్ బాల్ జట్టు మరో టైటిల్ ను సొంతం చేసుకుంది. 9వ సారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమిండియా జట్టు ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కువైట్‌ను ఓడించి టైటిల్‌ ను ముద్దాడింది. నిర్ణీత సమయం ముగిసే వరకూ భారత్, కువైట్ జట్లు ఒక్కో గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయింది. నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్ లో భారత్ ఎటువంటి తప్పిదం చేయలేదు. ఉత్కంఠ భరితంగా సాగిన పెనాల్టీ షూటౌట్ లో భారత్ 5-4తో కువైట్‌ను ఓడించింది. భారత్ గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021 సంవత్సరాలలో విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో విజయంతో 9వ సారి సాఫ్ ఛాంపియన్ గా అవతరించింది. ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ నేతృత్వంలో భారతదేశానికి వరుసగా రెండో SAFF టైటిల్.

సునీల్‌ ఛెత్రీ సారథ్యంలోని బారత ఫుట్‌బాల్‌ జట్టు కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తోంది. కొద్దిరోజుల కిందట ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌లో భారత్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో లెబనాన్‌పై 2-0తో గెలిచింది. ఇప్పుడు బెంగళూరులో జరిగిన దక్షిణాసియా ఫుట్‌బాల్‌(సాఫ్‌) చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచింది. భారత ఫుట్ బాల్ జట్టుకు పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు.


Tags:    

Similar News