నేడు భారత్ vs బంగ్లాదేశ్.. వరుణుడు కరుణిస్తాడా?
టీ 20 ప్రపంచ కప్ లో నేడు భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంటుంది
టీ 20 ప్రపంచ కప్ లో నేడు భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం రెండు మ్యాచ్ లు గెలిచి, ఒక మ్యాచ్ ఓడి భారత్ నాలుగు పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి తీరాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ కూడా నాలుగు పాయింట్లతో భారత్ తో సమానంగా ఉంది. అయితే భారత్ కొన్ని మార్పులతొ బరిలోకి దిగనను్నట్లు తెలిసింది.
పంత్ కు చోటు?
దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ కు చోటు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. దినేష్ కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో అతనిని ఈ మ్యాచ్ కు పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు కేెఎల్ రాహుల్ ఈ ప్రపంచ కప్ లో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. మూడు మ్యాచ్ లలో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. ఆడిలైడ్ లో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ గెలిచే జట్టు తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకునే అవకాశాలున్నాయి. అయితే వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. వర్షం పడితే మాత్రం ఇరు జట్లకు ఇబ్బందులు తప్పవు.