Jamnagar royal throne: మాహారాజు కాబోతున్న భారత జట్టు మాజీ క్రికెటర్

జామ్‌నగర్ రాజవంశానికి చెందిన సింహాసనాన్ని భారత క్రికెట్ జట్టు

Update: 2024-10-12 07:10 GMT

Ajay Jadeja

జామ్‌నగర్ రాజవంశానికి చెందిన సింహాసనాన్ని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అజయ్ జడేజా అధిష్టించనున్నారు. రాజకుటుంబం అజయ్ జడేజా కుటుంబ సింహాసనాన్ని వారసత్వంగా పొందుతారని ప్రకటించింది. ప్రస్తుతం సింహాసనం మీద ఉన్న జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సిన్హ్‌జీ జడేజా రాజకుటుంబానికి చెందిన అజయ్ జడేజాను అధికారికంగా తన వారసుడిగా ప్రకటించారు. ఇది ఆ వంశంలో ఒక ముఖ్యమైన ఘట్టమని చెబుతున్నారు.
“పాండవులు తమ 14 సంవత్సరాల అజ్ఞాత జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత విజయం సాధించిన రోజు దసరా. ఈ రోజు, అజయ్ జడేజా నా వారసుడిగా, నవనగర్ తదుపరి జంసాహెబ్‌గా ఉండబోతున్నారు, ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరం అని నేను నిజంగా నమ్ముతున్నాను, ”అని శత్రుసల్యాసిన్హ్జీ వెల్లడించారు.

అజ‌య్ జ‌డేజా భార‌త జ‌ట్టుకు 1992 నుంచి 2000 వరకు ఆడాడు. టీమిండియా త‌ర‌ఫున 196 వన్డేలు, 15 టెస్టుల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. బెంగుళూరులో జరిగిన 1996 క్రికెట్ ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్‌లో అజయ్ జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు, ముఖ్యంగా, వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలో 40 పరుగులు రావడం అప్పట్లో హైలెట్. అజయ్ జడేజా తన గొప్ప బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, అద్భుతమైన ఫీల్డర్‌గా కూడా పేరును సంపాదించుకున్నారు.
Tags:    

Similar News