ఆటగాడిగానే డౌట్ అనుకుంటే.. కెప్టెన్ గా రీఎంట్రీ
మ్యాచ్ లు ఆగస్టు 18, 20, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. గత సంవత్సరం బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో
భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన బుమ్రా తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇన్ని రోజులు అతడు ఆటకు దూరమని.. వరల్డ్ కప్ కు కూడా అనుమానాలే అంటూ ప్రచారం సాగింది. ఇప్పుడు ఏకంగా అతడిని కెప్టెన్ చేశారు. ఐర్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించగా.. ఈ టీమ్ కు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులో చేరాడు. దీంతో అతడు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ లో ఆడబోతున్నాడు. ఆగస్ట్ 30 నుంచి ఆసియా కప్ 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఆటగాళ్లను ఐర్లాండ్ టూర్‌కు ఎంపిక చేయలేదు.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు
జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.
మ్యాచ్ లు ఆగస్టు 18, 20, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. గత సంవత్సరం బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన టెస్ట్‌లో బుమ్రా భారతదేశానికి నాయకత్వం వహించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ -19 బారిన పడడంతో జట్టు నుండి తప్పుకున్నాడు. ఇంగ్లండ్ జట్టు విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. బుమ్రా చివరిసారిగా భారత జట్టు కోసం సెప్టెంబర్ 2022లో ఆడాడు. ప్రపంచ కప్‌లో బుమ్రా పునరాగమనం భారత జట్టుకు శుభవార్త అవుతుంది. అతని పేస్ భారత పిచ్‌లపై X-ఫ్యాక్టర్ అవుతుంది.