నేడు భారత్ - శ్రీలంక చివరి వన్డే
భారత్ - శ్రీలంక చివరి వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. రెండు వన్డేలను గెలిచి న భారత్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది
భారత్ - శ్రీలంక చివరి వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలను గెలిచి సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది. చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని శ్రీలంక ప్రయత్నిస్తుంది. తిరువనంతపురంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ కు ఇది నామమాత్రపు మ్యాచ్ కావడంతో జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశముంది. రెండు మ్యాచ్ లో ఆడని ఆటగాళ్లకు ఈ మ్యాచ్ లో అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.
శ్రీలంకకు మాత్రం...
పేసర్ షమికి విశ్రాంతి ఇచ్చి, ఆయన స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ కు అవకాశమివ్వనున్నారు. కులదీప్ యాదవ్ ను కొనసాగిస్తూ అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశమిచ్చే ఛాన్సుంది అని అంటున్నారు. శ్రీలంకతో సిరిసీ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ తో స్టార్టవుతుండటంతో కొందరికి ఈ మ్యాచ్ కు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. మరి చివరకు ఎవరు మ్యాచ్ ఆడతారన్నది ఇప్పటి వరకూ తెలియకున్నా శ్రీలంకకు మాత్రం తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ఇది చివరి అవకాశం.