Mahendrasingh Dhoni : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... మళ్లీ మైదానంలో మహేంద్రుడు

మహేంద్ర సింగ్ ధోని 2024 ఐపీఎల్ ఆడుతున్నాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది

Update: 2023-11-27 04:58 GMT

మహేంద్ర సింగ్ ధోని అంటే అదో క్రేజ్. ధోనీని మైదానంలో చూస్తుంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్ కడుపు నిండిపోతుంది. ధోని రిటైర్ అయి ఇన్నేళ్లయినా అదే నామస్మరణ స్టేడియాలలో వినిపిస్తుందంటే ధోని అంటే అంత క్రేజ్. ఇప్పటికీ ఇంచ్ కూడా తగ్గలేదు. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ధోనిని ప్రేమిస్తారు. కూల్ కెప్టెన్ గా భారత్ కు ఎన్నో విజయాలను అందించిన మహేంద్ర సింగ్ థోని ఇక మైదానంలో కనిపించడమోనన్న దిగులు ప్రతి ఒక్క అభిమానిని కలవరపర్చింది. అయితే ఐపీఎల్ ఆ కోరికను తీర్చింది.

రిటైర్ అవుతారని...
గత ఐపీఎల్ ధోనికి చివరదన్న ప్రచారం జరిగింది. వయసు ఎక్కువ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ధోని తప్పుకుంటున్నాడని కూడా అంతా అనుకున్నారు. కానీ ధోనిని అభిమానించే వారికి గుడ్ న్యూస్ చెప్పింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. అందులో ధోని పేరు ఉండటంతో ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. అన్ని ఫార్మాట్లకు ధోని గుడ్ బై చెప్పిన తర్వాత కేవలం మహేంద్రుడిని చూడటం కోసమే ఆయన అభిమానులు ఐపీఎల్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు.
ఇప్పటికీ తగ్గని...
ధోనీలో ఇప్పటికీ చేవ తగ్గలేదు. వికెట్లు వెనక ఉంటే ప్రత్యర్థి బ్యాటర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. ఏమాత్రం కాలు కదిపినా వికెట్లు ఎగిరి అవతలపడతాయి. అలా చేస్తాడు స్టంపింగ్ ను. ఇక బ్యాటింగ్ లోనూ ఏమాత్రం ధోని చేవ తగ్గలేదు. తన జట్టును గెలిపించడంలో ముందుంటున్నాడు. సమిష్టిగా జట్టును తీసుకెళ్తూ చెన్నై సూపర్ కింగ్స్ ను అనేకమార్లు విజేతగా నిలిపాడు. ఐపీఎల్ ట్రోఫీని ఆ జట్టు అన్ని సార్లు ముద్దాడిందంటే అది ధోని పుణ్యమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు.
జట్టు ఇదే...
అలాంటి ధోని 2024 ఐపీఎల్ లో కూడా మనకు మైదానంలో కనిపించనున్నాడు. అందుకోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ 2024 ఐపీఎల్ తన స్వ్కాడ్ ను ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, డెవాన్ కాన్వే, సుభ్రాంశు సేనాపతి, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, సిమ్రంజీత్ సింగ్, మతీష ప్రతిరాణ; ఆకాష్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మిచెల్ సాంట్నర్, రాజవర్థన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ, శివం దూబే, బెన్ స్ట్రోక్స్, డ్వైన్ ప్రిటోరియస్, అజింక్యా రహానే, సినంద మగల, నిశాంత్ సింధు, షేక్ రషీద్, అజయ్ మండల్, భగత్ వర్మ జట్టులో సభ్యులుగా ఉన్నారు.
Tags:    

Similar News