ఫైనల్ లో ఓడిన ప్రజ్ఞానంద.. దేశం గర్వించేలా చేశాడు

అజర్ బైజాన్ లోని బాకు నగరంలో జరిగిన ఫిడే ప్రపంచకప్ ఫైనల్లో భారత గ్రాండ్ మాస్టర్

Update: 2023-08-25 01:57 GMT

అజర్ బైజాన్ లోని బాకు నగరంలో జరిగిన ఫిడే ప్రపంచకప్ ఫైనల్లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ తో జరిగిన ఫైనల్ పోరులో 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు. కార్ల్ సన్, ప్రజ్ఞానంద మధ్య ఫైనల్లో రెండు క్లాసికల్ గేమ్ లు డ్రాగా ముగియడంతో, టై బ్రేక్ లో భాగంగా ర్యాపిడ్ రౌండ్ నిర్వహించారు. తొలిగేమ్ లో కార్ల్ సన్ గెలవగా, రెండో గేమ్ డ్రాగా ముగిసింది. రెండో గేమ్ లో ప్రజ్ఞానంద గెలిచి ఉంటే, ఈ పోరు బ్లిట్జ్ రౌండ్ కు దారితీసేది. రెండో గేమ్ ను ప్రజ్ఞానంద డ్రా చేసుకోవడంతో కార్ల్ సన్ ప్రపంచకప్ విజేతగా అవతరించాడు. ఐదు సార్లు వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ టైటిళ్లు సాధించిన 30 ఏళ్ల నార్వే గ్రాండ్ మాస్టర్ కార్ల్ సన్ కు కెరీర్ లో ఇదే తొలి ఫిడే వరల్డ్ కప్ టైటిల్. గతంలో పలుమార్లు కార్ల్ సన్ ను ఆన్ లైన్ చెస్ లో ఓడించిన ప్రజ్ఞానంద ముఖాముఖి పోరులో ఓడించిలేకపోయాడు. ఇది చాలా చిన్న వయసులో ప్రజ్ఞానంద సాధించిన అద్భుతమైన ఫీట్ గా అభివర్ణిస్తూ ఉన్నారు. ఫైనల్ లో ఓడినందుకు బాధపడకూడదని.. అద్భుతమైన ఆటతీరు కనబరిచావంటూ ప్రధాని మోదీ సహా పలువురు అంటున్నారు.

ప్రజ్ఞానంద భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహా యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. FIDE ప్రపంచ కప్‌లో ప్రజ్ఞానానంద ఇచ్చిన అద్భుతమైన ప్రదర్శన పట్ల మేము గర్విస్తున్నామన్నారు ప్రధాని మోదీ. అసాధారణ నైపుణ్యాలను ప్రజ్ఞానంద ప్రదర్శించాడని.. ఫైనల్స్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్‌కు గట్టి పోటీ ఇచ్చాడన్నారు. ఇదేమీ చిన్న ఫీట్ కాదని.. రాబోయే టోర్నమెంట్‌లలో ప్రజ్ఞానంద అద్భుతమైన విజయాలను అందుకుంటాడని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
ఆనంద్ మహీంద్రా ప్రజ్ఞానంద సాధించిన ఘనతపై ప్రశంసలు కురిపించారు. 'ప్రజ్ఞానంద నువ్వు రన్నరప్ కాదు.. ఇది నీకు రనప్ మాత్రమే. భవిష్యత్తులో నువ్వు సాధించే గోల్డ్ మెడల్‌‌, మరిన్నీ విజయాలకు ఓ గుణపాఠం మాత్రమే. ఈ ఓటమి అనేక యుద్దాలు చేయడానికి కావాల్సిన పాఠాన్ని నేర్పిస్తోంది. భవిష్యత్తులో నువ్వు విజయం సాధించిన అనంతరం మేమంతా మళ్లీ అభినందిస్తాం.'అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.


Tags:    

Similar News