సూప‌ర్ స్ట్రోక్స్‌తో రెచ్చిపోయిన రాహుల్ ద్రావిడ్ కొడుకు..!(వీడియో)

భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ కూచ్ బెహార్ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో

Update: 2023-12-21 09:21 GMT

Rahul Dravid's son Samit 

భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ కూచ్ బెహార్ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక తరఫున 98 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సమిత్ తన ఇన్నింగ్స్‌లో చాలా ఆకర్షణీయమైన స్ట్రోక్‌లు ఆడాడు. సమిత్ ద్రవిడ్ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 98 పరుగులు చేశాడు.

జమ్మూకశ్మీర్‌పై కర్ణాటక ఇన్నింగ్స్ 130 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రాహుల్ ద్రావిడ్ కుమారుడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో సమిత్ ద్రవిడ్ అద్భుతమైన షాట్‌లు కొడుతుండ‌టం చూడొచ్చు.

ఈ మ్యాచ్‌లో జమ్మూ కాశ్మీర్ మొదట బ్యాటింగ్ చేసింది. జట్టు మొత్తం 170 పరుగులకు ఆలౌట్ అయింది. అనంత‌రం సమిత్ ద్ర‌విడ్‌ కర్ణాటక తరఫున ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి కార్తికేయ కేపీతో కలిసి నాలుగో వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కార్తికేయ కేపీ 175 బంతుల్లో 163 ​​పరుగులు చేశాడు. కార్తికేయ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కర్ణాటక తన తొలి ఇన్నింగ్స్‌ను 100 ఓవర్లలో 480/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. జమ్మూ కాశ్మీర్ రెండో ఇన్నింగ్స్ కూడా త్వరగా ముగిసింది. తద్వారా కర్ణాటక ఒక ఇన్నింగ్స్ 130 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

రాహుల్ ద్రావిడ్, అతని భార్య విజేత కొంత‌కాలం క్రితం విరామ స‌మ‌యంలో తన కొడుకు స‌మిత్‌ను ప్రోత్సహించడానికి స్టేడియానికి వెళ్లాడు. అందుకు సంబంధించిన పోటోలు, వీడియోలు కూడా తెగ వైర‌ల్ అయ్యాయి.


Tags:    

Similar News