అర్ష్‌దీప్ అట్టర్ ఫెయిల్యూర్... చితక్కొట్టారు... కానీ...?

రెండో టీ20 కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. భారత బౌలర్లు, బ్యాటర్లు విఫలమయినా చివర వరకూ పోరాడి ఓడింది.

Update: 2023-01-06 02:22 GMT

రెండో టీం కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. భారత బౌలర్లు, బ్యాటర్లు విఫలమయినా చివర వరకూ పోరాడి ఓడింది. దీంతో టీ 20 సిరీస్1 - 1 తో సమమమయింది. అయిందే పూనే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే బౌలర్ అర్ష్ దీప్ అట్లర్ ఫెయిల్యూర్ అయ్యాడు. కేవలం రెండు ఓవర్లు మాత్రమే చేసిన అర్ష్ దీప్ ఐదు నో బాల్స్ వేశాడు. చెత్త బౌలింగ్ చేసి అత్యధికంగా పరుగులు ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ నాలుగు వికెట్లు తీసుకున్నా శ్రీలంక కెప్టెన్ షనక ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించి స్కోరును 206 పరుగులు చేశాడు.

చెత్త బ్యాటింగ్....
అయితే భారీ స్కోరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి వికెట్లు పతనం ప్రారంభమయింది. ఓపెనర్లు ఇషాన్, గిల్ ఇంటి దారి పట్టారు. కేవలం 57 పరుగులకే ఐదు పరుగులకే భారత్ పరిమితమయింది. అతి చెత్త ఓటమిని మూటగట్టుకుంటుందని భారత్ అభిమానులు భావించారు. కానీ అక్షర్ పటేల్, సూర్య కుమార్ చెలరేగి ఆడటంతో భారత్ పరువు నిలబడింది. అక్షర్ పటేల్ 65, సూర్యకుమార్ యాదవ్ 51, శివమ్ మావి ఆడటంత భారత్ ఆ మాత్రం పరుగులు చేయగలిగింది. 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి వెనుదిరిగింది. భారత్ పరువు దక్కడానికి అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ లు మాత్రమే. బౌలర్లు కట్టడి చేయలేకపోవడం వల్లనే శ్రీలంక అత్యధిక స్కోరును చేయగలిగింది.


Tags:    

Similar News