సూపర్ క్రికెటర్ శ్రేయాంక పాటిల్.. అరుదైన ఘనత
మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆడనున్న
మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. పురుషులు లేదా మహిళా క్రికెట్ లో ఎవరూ కూడా కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడలేదు. ఇటీవల ముగిసిన మహిళల ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన శ్రేయాంక గురించి బాగా చర్చ జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఇంకా శ్రేయాంక ఆడలేదు.. అయితే సీపీఎల్ ఆడే అవకాశం దక్కించుకుంది. సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఫ్రాంచైజీ శ్రేయాంకతో ఒప్పందం కుదుర్చుకుంది.
మహిళా క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో హ్యాపీగా ఆడుకోవచ్చు. వారికి ఎలాంటి అంక్షలు లేవు. పలువురు భారత మహిళా క్రికెటర్లు ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లండ్ హండ్రెడ్ టోర్నీల్లో పాల్గొన్నారు. ఏ భారత క్రికెటర్ కూడా సీపీఎల్‌లో ఆడలేదు. తాజాగా శ్రేయాంకకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. 20 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ అయిన శ్రేయాంక.. విమెన్స్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఏసీసీ మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో సత్తా చాటి (ప్లేయర్ ఆఫ్ ద సిరీస్) లీగ్ క్రికెట్‌లో విదేశీ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. ఇక సీపీఎల్‌లో శ్రేయాంక స్టెఫానీ టేలర్ నేతృత్వంలో గయానా ఆమెజాన్ వారియర్స్‌కు ఆడనుంది. శ్రేయాంకతో పాటు ఆర్సీబీ సహచరిణులైన సుజీ బేట్స్, సోఫీ డివైన్‌లను కూడా ఆమెజాన్ వారియర్స్ ఎంపిక చేసుకుంది. సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ కూడా ఆమెజాన్ వారియర్స్‌కు ఆడనుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆగస్ట్ 31న మొదలై సెప్టెంబర్ 10 వరకు సాగనుంది. ఈ లీగ్‌లో మొత్తం 3 జట్లు పాల్గొంటాయి.