ప్రేక్షకుడిని ఒక రేంజిలో తిట్టిన విరాట్ కోహ్లీ
లీసెస్టర్‌షైర్, టీమిండియా మధ్య జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఓ ప్రేక్షకుడు ఓవరాక్షన్
తనతో పాటూ ఉండే సహచరులకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ మద్దతును ఇస్తూ ఉంటాడు. అయితే ఎవరైనా భారత ఆటగాళ్లను కించపరిస్తే మాత్రం విరాట్ కోహ్లీ కొంచెం కూడా ఓర్చుకోలేడు. గతంలో కొందరు క్రికెటర్లు భారత ఆటగాళ్లను మైదానంలో మాటలు అంటే కోహ్లీ ధీటుగా బదులిచ్చాడు. ఇప్పుడు మరోసారి తనదైన శైలిలో కోహ్లీ ఓ ప్రేక్షకుడికి క్లాస్ తీసుకున్నాడు.
లీసెస్టర్‌షైర్, టీమిండియా మధ్య జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఓ ప్రేక్షకుడు ఓవరాక్షన్ చేస్తుంటే కోహ్లీ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. బాల్కనీలో నుంచే సదరు ప్రేక్షకుడిపై కోహ్లీ కాస్త సీరియస్ అయ్యాడు. కోహ్లీ కోపం చూసి ఆ ప్రేక్షకుడు గమ్మున ఉండిపోయాడు. కోహ్లీతో వాదించాలని చూసినా.. కోహ్లీ ప్రశ్నలకు ప్రేక్షకుడు సైలెంట్ అయిపోయాడు. వార్మప్ మ్యాచ్ మూడో రోజు కమలేష్ నాగర్‌కోటి లీసెస్టర్ షైర్ తరఫున బౌలింగ్ చేశాడు. ఇక కమలేష్ ఫీల్డింగ్ టైంలో బౌండరీ లైన వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ ప్రేక్షకుడు కమలేష్ నాగర్‌కోటిని ఎగతాళి చేస్తూ కన్పించాడు. కమలేష్ ఒక్క సెల్ఫీ ప్లీజ్.. అంటూ తీవ్రంగా అరిచాడు. అతను అలా కమలేష్‌ను విసిగెత్తించడం డ్రెస్సింగ్ రూంలో నుంచి విరాట్ కోహ్లీ చూశాడు. వెంటనే బాల్కనీలోకి వచ్చి ఆ అభిమాని మీద విరుచుకుపడ్డాడు.
కమలేష్ నాగర్‌కోటితో ఒక ఫోటో దిగాలని ఆశపడుతున్నానని.. నేను ఆఫీసుకు సెలవు పెట్టి మరీ వచ్చాను. కనీసం అతను నాతో ఒక్క సెల్ఫీ దిగితే ఏం పోతుంది. అందుకే అతన్ని నేను ఇలా రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ అతను హిందీలో కోహ్లీతో వాదించాడు. ఇంతలో కోహ్లీ.. అతను మ్యాచ్ ఆడటానికి వచ్చాడా లేదా నీతో ఫోటోలు దిగడానికి వచ్చాడా.. అంటూ కోహ్లీ అడగడంతో ఆ అభిమాని సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.