Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ .. అందుకోసం కెమెరాలను కొనుగోలు చేశారట

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కోణం వెలుగు చూసింది. ఫాం హౌస్ లో బీజేపీ నేతలను ట్రాప్ చేయడానికి కెమెరాలను కొనుగోలు చేశారు.

Update: 2024-05-27 06:41 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు చూస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కోణం వెలుగు చూసింది. మొయినా బాద్ ఫాం హౌస్ కేసులో అప్పటి చేవెళ్ల ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఫాం హౌస్ కేసులో...
అయితే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాం హౌస్ లో బీజేపీ నేతల మాటలను, దృశ్యాలను రికార్డు చేయడానికి అత్యంత ఖరీదైన కెమెరాలను కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ కెమెరాలను ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను తప్పించడానికి కౌంటర్ గా ఈ కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ ను ఇరికించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. ఫాం హౌస్ లో బీజేపీ నేతల కాల్ రికార్డింగ్ చేయడానికి పెద్దయెత్తున సొమ్మును వెచ్చించినట్లు విచారణలో తేలింది.


Tags:    

Similar News