KCR : సుప్రీంకోర్టులో కేసీఆర్ కొంత ఊరట దక్కిందిగా

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో కొంత ఊరట దక్కింది.

Update: 2024-07-16 07:41 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో కొంత ఊరట దక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలపై నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి విచారణకు ముందే వెల్లడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

విచారణ పూర్తికాకముందే...
విచారణ పూర్తికాకముందే మీడియా సమావేశం పెడితే అసలు విచారణ ఎలా సాగుతుందని సీజేఐ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ తో విద్యుత్తు కొనుగోలుతో పాటు, యాదాద్రి, భద్రాద్రి ధర్మల్ విద్యుత్తు నిర్మాణంలో అవకతవకలకు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే. కమిషన్ ఈ మేరకు విచారణను ప్రారంభించింది. జూన్ 11వ తేదీన కమిషన్ ఛైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పు పట్టింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించాలని కోరింది. విచారణను కొనసాగించడంలో మాత్రం అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విచారణ కమిషన్ ఛైర్మన్ పేరును చెబుతామని ప్రభుత్వం తరుపున న్యాయవాది స్పష్టం చేశారు. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.


Tags:    

Similar News