BRS : తెలంగాణ చిహ్నం మార్పుపై కేసు వేస్తాం

తెలంగాణ చిహ్నం మార్పుపై న్యాయస్థానంలో కేసు వేస్తామని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తెలిపారు

Update: 2024-05-30 03:07 GMT

తెలంగాణ చిహ్నం మార్పుపై న్యాయస్థానంలో కేసు వేస్తామని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాన్ని మార్చడాన్ని ఆయన తప్పు పట్టారు. జూన్ రెండో తేదీన తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ చిహ్నాన్ని మారుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

న్యాయస్థానంలో...
అయితే దీనిపై వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాకతీయుల చరిత్ర ఏంటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. రాచరికపు చిహ్నాలు అంటూ చేస్తున్న మార్పులపై కోర్టులో కేసు వేస్తామని అన్నారు. న్యాయస్థానంలోనే తాము ఈ విషయంలో తేల్చుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతామని తెలిపారు.


Tags:    

Similar News